సోమవారం 28 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 18:24:54

కరోనాతో రిటైర్డ్‌ ఐఏఎస్‌ మృతి

కరోనాతో రిటైర్డ్‌ ఐఏఎస్‌ మృతి

పాట్నా : బీహార్‌ కేడర్‌ 1980 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి మనోజ్‌ శ్రీవాస్తవ (65) కరోనా బారినపడగా.. గురువారం పాట్నా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. బీహార్‌ విపత్తు నిర్వహణ విభాగం వ్యవస్థాపక కార్యదర్శిగా ఆయన సమర్థవంతమైన వ్యూహాలను రచించారని పేరుంది. ఎస్‌డీఎం మొదటి పోస్టు నుంచి ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ హోదా పని చేయగా, పీపుల్స్‌ ఫ్రెండ్లీ ఆఫీసర్‌గా పేరుపొందారు శ్రీవాస్తవ. యూఎన్‌ డీపీ డిజాస్టర్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్ కింద 2007లో బీహార్‌లో వరదల సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆహార పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.

డీఎంగా భోజ్‌పూర్‌లో నక్సలిజంపై ఆయన చేసిన పరిశోధన అత్యంత అద్భుతమైన విజయం. ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలకు పూర్వ విద్యార్థిగానే కాక, ఐఐఎం, అహ్మదాబాద్‌లలో విశిష్ట వ్యక్తి. బ్యూరోక్రటిక్‌ సర్కిల్‌లో నడిచే ఎన్‌సైక్లోపిడియాగా పేరు పొందిన ఆయన.. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుకున్నారు. ఐఏఎస్‌కు ఎంపికవ్వక ముందు శ్రీవాత్సవ ఇండియన్‌ పోలీస్‌ సర్వీసెస్‌ (ఐపీఎస్‌) ప్రొబేషనర్‌గా పని చేశారు. 2016లో ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ నుంచి రిటైర్‌ అయ్యారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo