శనివారం 11 జూలై 2020
National - Jun 29, 2020 , 19:36:47

బీహార్‌లో కొత్తగా 282కరోనా కేసులు

బీహార్‌లో కొత్తగా 282కరోనా కేసులు

పాట్నా : బీహార్‌లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిత్యం 200కు పైగా కొత్త కేసులు ఆ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కోరోజే 282 కేసులు నమోదుకాగా ఇప్పటివరకు కేసుల సంఖ్య  9,506కు చేరిందని, 64మంది మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా నియంత్రణకు జాగ్రత్తలు పాటించాలని ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా దేశంలోనూ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 5.5లక్షల మంది వైరస్‌ బారినపడగా 16,447 మంది చనిపోయారు. 2,10,120 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంరక్షణ మంత్రిత్వశాఖ తన నివేదికలో వెల్లడించింది. 


logo