మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 24, 2020 , 21:45:00

జేడీఆర్పీ అభ్యర్థిపై దుండగుల కాల్పులు

జేడీఆర్పీ అభ్యర్థిపై దుండగుల కాల్పులు

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాల్పుల ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. జనతాదళ్ రాష్ట్రవాదీ పార్టీ (జేడీఆర్పీ) అభ్యర్థి నారాయణ్ సింగ్‌పై షియోహార్ జిల్లాలోని హత్సర్ గ్రామంలో దుండగులు శనివారం కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే దవాఖానకు తరలించారు. అయితే సింగ్‌ పరిస్థితి ఎలా ఉన్నదో తెలియలేదు. మరోవైపు కాల్పులకు పాల్పడిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 28న తొలి దశ ఎన్నికలు, నవంబర్‌ 3న రెండో దశ ఎన్నికలు, 7న మూడో దశ పోలింగ్‌ జరుగుతుంది. నవంబర్‌ 10న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.