మంగళవారం 04 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 17:35:16

బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయండి..

బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయండి..

పాట్నా: ఓ వైపు కరోనా, మరోవైపు వరదల నేపథ్యంలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ఆ రాష్ట్రానికి చెందిన మెజార్టీ రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఆ రాష్ట్రంలో అక్టోబర్, నవంబర్ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. కాగా, బీహార్‌లో ఒకవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. సుమారు 50 లక్షల మంది ప్రభావితమయ్యారు.

ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలోని 50 రాజకీయ పార్టీల నుంచి సూచనలు కోరింది. ఇందులో ఏడు జాతీయ పార్టీలు కాగా 43 ప్రాంతీయ పార్టీలు. అయితే రాష్ట్రంలోని అధికార పార్టీ జేడీయూ, ప్రభుత్వానికి మద్దతిచ్చిన బీజేపీ తప్ప మిగతా మెజార్టీ పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల వాయిదాకు మొగ్గుచూపాయి. బీజేపీ కూటమికి చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ), ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికలను వాయిదా వేయాలని ఈసీఐకి వినతించాయి.logo