సోమవారం 10 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 11:04:33

ఎన్నిక‌లు వాయిదా వేయండి... ఈసీని కోరిన పార్టీలు

ఎన్నిక‌లు వాయిదా వేయండి... ఈసీని కోరిన పార్టీలు

ప‌ట్నా: వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల‌ను వాయిదావేయాల‌ని బీహార్‌లోని రాజ‌కీయ ప‌క్షాలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. రాష్ట్రంలో క‌రోనా తీవ్ర‌త‌, వ‌ర‌ద‌ల‌ను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డంపై జూలై 31లోపు ‌ అభిప్రాయం చెప్పాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ రాజ‌కీయ పార్టీల‌ను కోరింది. 

దీంతో అధికార జేడీయూ, బీజేపీ మిన‌హా రాష్ట్రంలోని అన్నిపార్టీలు ఎన్నిక‌ల‌ను వాయిదావేయాల‌ని కోరాయి. బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైనా లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీ (ఎల్‌జేపీ) కూడా ఎన్నిక‌ల వాయిదాకే మొగ్గుచూపింది. ఇక కాంగ్రెస్‌, రాష్ట్రీయ జ‌న‌తాద‌ల్ (ఆర్జేడీ) పార్టీలు ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని ఎప్ప‌టినుంచో కోరుతున్నాయి.  కాగా, సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీలు ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్నామ‌ని, ఎన్నిక‌ల సంఘం ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా త‌మ‌కు స‌మ్మ‌త‌మేన‌ని తెలిపాయి. 

వ‌ర‌ద‌ల వ‌ల్ల రాష్ట్రంలో సుమారు 50 ల‌క్షల మంది నిరాశ్ర‌యుల‌య్యార‌ని, 14 జిల్లాలు వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్నాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 54,240 మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా, 309 మంది మ‌ర‌ణించారు. మ‌రో 34,994 మంది బాధితులు కోలుకోగా, 18,937 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.   


logo