సోమవారం 25 మే 2020
National - Apr 04, 2020 , 14:25:26

దండ‌లు వేసి దండం పెడుతున్న బీహార్ పోలీసులు

దండ‌లు వేసి దండం పెడుతున్న బీహార్ పోలీసులు

ప‌ట్నా: క‌రోనా ర‌క్క‌సిని క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌భుత్వాలు ఎన్నో చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. దీంతో జ‌నం మొత్తం ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే కొంత మంది మాత్రం లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోవ‌డంలేదు. య‌థేచ్ఛ‌గా రోడ్ల మీద‌కు వ‌స్తూ పోలీసుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ ఉల్లంఘ‌నుల బుద్ధి మార్చ‌డం కోసం బీహార్ పోలీసులు వినూత్న పంతా అనుస‌రిస్తున్నారు. ఈ ఉద‌యం ప‌ట్నాలో రోడ్ల‌కు మీద‌కు వ‌చ్చిన వారికి పోలీసులు దండ‌లు వేసి దండాలు పెట్టారు. ద‌య‌చేసి లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo