సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 17:36:00

కరోనా ఎఫెక్ట్‌ : రెండురోజుల్లో ఇద్దరు ఆత్మహత్య

కరోనా ఎఫెక్ట్‌ : రెండురోజుల్లో ఇద్దరు ఆత్మహత్య

పాట్నా : కరోనా మహమ్మారి బారినపడి భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. బీహార్‌ రాష్ట్రంలో రెండురోజుల వ్యవధిలో ఇద్దరు కరోనా రోగులు ఆత్మహత్య చేసుకోవడం కలవరపెడుతోంది. శుక్రవారం పాట్నాలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్‌)భవనం ఐదో అంతస్తు నుంచి దూకి కరోనా రోగి మృతి చెందాడు. ఈ ఘటన తాలుకు విషాదం మరువక ముందే  శనివారం పాట్నాలోని మల్సలామి ప్రాంతంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న (35) ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏయిమ్స్‌కు తరలించినట్లు ఫుల్వారీ షరీఫ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) రఫీక్ యూఆర్ రెహమాన్ తెలిపారు. బీహార్‌ రాష్ట్రంలో కరోనా బారినపడి ఇప్పటివరకు 22,343 మంది కోలుకోగా 11,363 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 220 మంది మృతి చెందారు.logo