గురువారం 09 జూలై 2020
National - Jun 28, 2020 , 19:20:10

బీహార్‌ మంత్రికి కరోనా పాజిటివ్‌!

బీహార్‌ మంత్రికి కరోనా పాజిటివ్‌!

కటిహార్‌: రాజకీయ నాయకులు, సెలబ్రిటీలనే తేడాలేకుండా కరోనా అందరినీ ఆగం చేస్తున్నది. తాజాగా, బీహార్‌కు చెందిన ఓ మంత్రి ఈ మహమ్మారి బారినపడ్డాడు. బీహార్‌ మంత్రి వినోద్‌సింగ్‌కు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడిని కటిహార్‌ జిల్లాకేంద్రంలోని ఓ హోటల్‌లో క్వారంటైన్‌ చేశారు. రెండురోజుల క్రితం అతడు రాష్ట్ర సెక్రెటేరియట్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నాడు. కాగా, ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తన భార్యకు కూడా కరోనా పాజిటివ్‌ రావొచ్చని ఆందోళన వ్యక్తంచేశాడు. logo