సైకిల్‌పై ఢిల్లీ.. ఆందోళన బాటలో బీహారీ రైతు

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న ఆందోళనలో పాల్గొనేందుకు 60 ఏండ్ల బీహార్ రైతు సైకిల్‌పై ఢిల్లీకి చేరుకున్నారు. బీహార్‌లోని శివాన్ జిల్లాకు చెందిన సత్యదేవ్ మాంఝీ అనే ఈ రైతు గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ తన సొంత జిల్లా శివాన్ నుంచి ఢిల్లీకి చేరుకోవడానికి 11 రోజులు పట్టిందన్నాడు. కేంద్రం ఇప్పటికైనా సదరు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని అభ్యర్థించాడు.
ఇదిలా ఉంటే 60 ఏండ్లుగా రైతుల హక్కులను దోచుకున్న వారే వారిని ఇప్పుడు తప్పుదోవ పట్టిస్తున్నారని హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీని సాకారం చేసేందుకు, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు మోదీ సర్కార్ కృషి చేస్తున్నదని అమిత్‌షా చెప్పారు.
మరోవైపు, కనీస మద్దతుధరపై రాతపూర్వక హామీ ఇచ్చేందుకు సిద్ధమని రైతు సంఘాల నేతలకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లేఖ రాశారు. తమ ఆందోళనపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై రైతులు, రైతు సంఘాల నేతలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కిసాన్ ర్యాలీ భగ్నానికి ఉగ్ర కుట్ర
- రాజ్యాంగం అసలు కాపీని ఆ బాక్స్‌లో ఎందుకు ఉంచారో తెలుసా?
- ఎగిరే బల్లి..పొలంలో అలజడి
- ట్రంప్ కొత్త పార్టీ పెట్టడం లేదు..
- ఈ 'కుక్క' మాకూ కావాలి
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా
- అమెరికాలో కాల్పులు.. గర్భిణి సహా ఐదుగురు మృతి
- వ్యవసాయ చట్టాలతో రైతులపై ప్రధాని దాడి: రాహుల్‌గాంధీ