గురువారం 24 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 14:02:36

బీహార్ ప్రభుత్వం కోవిడ్‌ అంకెలను తారుమారు చేస్తోంది : తేజస్వీ యాదవ్

బీహార్ ప్రభుత్వం కోవిడ్‌ అంకెలను తారుమారు చేస్తోంది : తేజస్వీ యాదవ్

పాట్నా : బీహార్ ప్రభుత్వం కోవిడ్‌ అంకెలను తారుమారు చేస్తోందని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. గురువారం పాట్నాలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో 10 వేల పరీక్షలు చేసినప్పుడు 3,000 నుంచి 3,500 పాజిటివ్‌ కేసులు నమోదైతే బుధవారం 75 వేల పరీక్షలు చేసి 4 వేల కేసులు నమోదయ్యాయని చూపడం అనుమానాలకు తావిస్తోందన్నారు. యాంటీజెన్ పరీక్షలు వేగవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పుకునేందుకే పరీక్షల సంఖ్యను అధికంగా చూపుతున్నారని ఆక్షేపించారు.

సగటున 6,100 ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుందని, అంటే మొత్తం పరీక్షల్లో కేవలం 10 శాతం మాత్రమే ఈ విధానంలో నిర్వహిస్తుందని తెలిపారు. ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  కోవిడ్‌-19 ప్యాకేజీ  విషయంలో బీహార్‌పై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుందని మండిపడ్డారు. కేంద్రం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.890 కోట్లు కేటాయించినా బీహార్‌కు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. logo