మంగళవారం 26 జనవరి 2021
National - Dec 23, 2020 , 01:29:54

రాసలీలల జడ్జీల ఉద్యోగాలు గాయబ్‌

రాసలీలల జడ్జీల ఉద్యోగాలు గాయబ్‌

పాట్నా: కొన్నేండ్ల కిందట నేపాల్‌లోని ఓ హోటల్‌లో మహిళలతో రాసలీలలు జరుపుతూ పట్టుబడిన ముగ్గురు జడ్జీలను ఉద్యోగాల నుంచి తొలిగిస్తూ బీహార్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్‌లోని సమస్తిపూర్‌లో గతంలో ప్రిన్సిపల్‌ జడ్జిగా పనిచేసిన హరి నివాస్‌ గుప్తా, మరో ఇద్దరు జడ్జీలు జితేంద్రనాథ్‌ సింగ్‌, కోమల్‌ రాంలను నేపాల్‌లో ఒక హోటల్‌లో మహిళలతో కలిసి ఉన్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు. దీనిపై పాట్నా హైకోర్టు విచారణకు ఆదేశించింది. విచారణ జరిపిన అధికారులు ముగ్గురు జడ్జీలు తప్పు చేసినట్లు ధ్రువీకరించారు. దీంతో హైకోర్టు ఈ ముగ్గురిని ఉద్యోగాల్లో నుంచి తొలిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ముగ్గురు జడ్జీలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో ముగ్గురు జడ్జిలను ఉద్యోగాల నుంచి తొలిగిస్తున్నట్లు బీహార్‌ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.


logo