బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 16, 2020 , 01:37:28

అంబేద్కర్‌ విగ్రహానికి సీపీఐ, ఆర్జేడీ జలశుద్ధి

అంబేద్కర్‌ విగ్రహానికి సీపీఐ, ఆర్జేడీ జలశుద్ధి
  • కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ అపవిత్రం చేశారని ఆరోపణ

బెగుసరాయి (బీహార్‌): కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తీరుతో బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం అపవిత్రమైందని ఆరోపిస్తూ సీపీఐ, ఆర్జేడీ కార్యకర్తలు శనివారం నీటితో విగ్రహాన్ని శుద్ధిచేశారు. శుక్రవారం బీహార్‌ బాలియాలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు మద్దతుగా నిర్వహించిన సమావేశానికి గిరిరాజ్‌సింగ్‌ హాజరైన సందర్భంగా పార్కులోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. వారం కిందటే అదే ప్రాంతంలో సీఏఏకు వ్యతిరేకంగా సభను నిర్వహించిన.. సీపీఐ నాయకుడు సనోజ్‌ సరోజ్‌, ఆర్జేడీ నాయకుడు వికాస్‌ పాశ్వాన్‌, రూప్‌ నారాయణ్‌ పాశ్వాన్‌ శనివారం జైభీం అంటూ నినాదాలు చేస్తూ, పూలేను స్మరిస్తూ నీటితో అంబేద్కర్‌ విగ్రహాన్ని శుద్ధిచేశారు. ‘శుక్రవారం సమావేశానికి వచ్చిన గిరిరాజ్‌సింగ్‌ బాలియా చిన్న పాకిస్థాన్‌గా మారిందని వ్యాఖ్యానించడంతో ఇక్కడి వాతావరణం కలుషితమైంది’ అని ఉన్న వీడియోను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. దైనికైతే వ్యతిరేకంగా అంబేద్కర్‌ పోరాటం చేశారో.. ఆయన విగ్రహం వద్దే నిలబడి అగ్రకుల ఆధిపత్యం ప్రదర్శించారని ఆరోపించారు. 


logo
>>>>>>