శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 08:40:19

రాజ్య‌స‌భ విప‌క్ష ఎంపీల వైఖ‌రిని ఖండించిన సీఎం నితీశ్‌

రాజ్య‌స‌భ విప‌క్ష ఎంపీల వైఖ‌రిని ఖండించిన సీఎం నితీశ్‌

హైద‌రాబాద్‌: రాజ్య‌స‌భ‌లో డిప్యూటీ చైర్మ‌న్ హ‌రివంశ్ ప‌ట్ల స‌భ్యులు ప్ర‌వ‌ర్తించిన తీరును బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఖండించారు. ఆదివారం స‌భ‌లో వ్యవ‌సాయ బిల్లులను ఆమోదించే ప్ర‌క్రియ‌ను ఎంపీలు అడ్డుకున్న విష‌యం తెలిసిందే. వాయిస్ ఓటింగ్ స‌మ‌యంలో విప‌క్ష స‌భ్యులు డిప్యూటీ చైర్మ‌న్ డెస్క్‌పైకి దూసుకువెళ్లారు.  రాజ్య‌స‌భ ప‌రంప‌ర‌కు, మ‌ర్యాద‌కు విరుద్ధంగా ఎంపీలు ప్ర‌వ‌ర్తించిన‌ట్లు నితీశ్‌ ఆరోపించారు.  త‌న ట్విట్ట‌ర్ ద్వారా సీఎం నితీశ్ ఈ ఘ‌ట‌నపై స్పందిస్తూ.. రాజ్య‌స‌భలో జ‌రిగిన వివాదం ప‌ట్ల దుఖ్కాన్ని వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలిపారు. రాజ్య‌స‌భ హుందాత‌నానికి ఈ ఘ‌ట‌న మ‌చ్చ‌గా మిగులుతుంద‌న్నారు. ప్రజాస్వామ్యంలో స‌భ మ‌ర్యాద‌ను స‌భ్యులే కాపాడాల‌న్నారు. logo