బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 21:08:14

ఈత సరదాకోసం ప్రాణం పణంగా..

ఈత సరదాకోసం ప్రాణం పణంగా..

కతిహార్‌ : బీహార్‌ రాష్ట్రంలోని కతిహార్ జిల్లా దండ్‌ఖోరా గ్రామంలో పిల్లలు, యువకులు సరదాకోసం ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్ననదిలో ఈదుతున్నారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా గ్రామ సమీపంలోని మహానంద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహాన్ని లెక్కచేయకుండా పిల్లలు ఏకంగా వంతెనపై నుంచి ఉప్పొంగుతున్న నదిలోకి దూకి ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. ‘మేము వారిపై నిఘా పెట్టాం. వారు అద్భుతమైన ఈతగాళ్లు కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు. సరదాకోసం వారు అప్పుడప్పుడు అలా చేస్తారు’ అని గ్రామస్తుడొకరు చెప్పాడు. నదిలో ప్రస్తుతం 40-50 అడుగుల లోతులో నీరు ప్రవహిస్తోంది. బీహార్‌లోని చాలా నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 8 జిల్లాలు వరదలకు అతలాకుతలమైన సంగతి తెలిసిందే.


logo