బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 16:12:09

వివాహమైన రెండురోజులకే వరుడు మృతి

వివాహమైన రెండురోజులకే వరుడు మృతి

  • వేడుకలో పాల్గొన్న 70మందికి కరోనా.. వరుడి తండ్రిపై కేసు

పాలిగంజ్‌ : వివాహమైన రెండురోజులకే వరుడు అనుమానాస్పదంగా మృతి చెందగా వేడుకలో పాల్గొన్న 70మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వరుడి తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విచారకర ఘటన బీహార్‌ రాష్ట్రంలోని పాలిగంజ్‌ ప్రాంతంలోని ద్హిపాలి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు ఢిల్లీలో సాఫ్టువేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. వివాహం నిశ్చయం కావడంతో జూన్‌ 6న స్వగ్రామానికి రావడంతో అధికారులు రెండు వారాలపాటు హోంక్వారంటైన్‌ ఉండాలని సూచించారు. కుటుంబీకులు నిబంధనలు పాటించకుండా జూన్‌ 15న 70మంది బంధువులను ఆహ్వానించి అతడికి వివాహం జరిపించాడు. వివాహమైన రెండు రోజులకే యువకుడు మృతి చెందగా కారణాలు నిర్ధారించ లేకపోయామని పాలిగంజ్‌ ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజిత్‌కుమార్‌ తెలిపారు. వరుడి నివాసిత పరిసర ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతాన్ని ముసివేశామని, వరుడు ఖచ్చితంగా కరోనాతోనే మృతి చెందాడని చెప్పడానికి అవకాశం లేదని ఇతర అనారోగ్య సమస్యలు కొట్టి పారేయలేమని బ్లాక్‌ అభివృద్ధి అధికారి (బీడీఓ) చిరంజీవి పాండే అన్నారు. వరుడిని దవానం చేయడంతో శవపరీక్షలకు ఆస్కారం లేకుండా పోయిందని పేర్కొన్నారు. 


logo