మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 10, 2020 , 16:24:48

21 నియోజ‌క‌వ‌ర్గాల్లో.. ఓట్ల తేడా వెయ్యిలోపే

21 నియోజ‌క‌వ‌ర్గాల్లో.. ఓట్ల తేడా వెయ్యిలోపే

హైద‌రాబాద్‌: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట్ల లెక్కింపు కొన‌సాగుతున్న‌ది.  ప్ర‌స్తుతం అందుతున్న వార్తల ప్ర‌కారం .. ఎన్డీఏ కూట‌మి లీడింగ్‌లో ఉన్న‌ది.  అయితే దాదాపు 21 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇద్ద‌రు అభ్య‌ర్థుల మ‌ధ్య వెయ్యి ఓట్ల లోపే ఉన్న‌ట్లు తెలుస్తోంది.  అలీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో మిశ్రి లాల్ యాద‌వ్ కేవ‌లం 42 ఓట్ల తేడాతో ఆర్జేడీ అభ్య‌ర్థి బినోద్ మిశ్రాపై ఆధిక్యంలో ఉన్నారు. మాధేపుర‌లో జేడీయూ అభ్య‌ర్థి కేవ‌లం 200  ఓట్ల తేడాతో ఆర్జేడీ అభ్య‌ర్థిపై ఆధిక్యంలో ఉన్నారు.  క‌స్బా నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్‌కు చెందిన అహ్మాద్ ఖాన్‌.. జేడీయూ అభ్య‌ర్థి సూర‌జ్ ప్ర‌కాశ్ మ‌ధ్య నువ్వ‌నేనా అన్న‌ట్లు రేస్ న‌డుస్తోంది.  

ద‌ర్బంగాలో సంజ‌య్ గెలుపు..

ద‌ర్బంగాలో బీజేపీ అభ్య‌ర్థి సంజ‌య్ స‌రోగి విజ‌యం సాధించింది.  ప‌దివేల ఓట్ల మెజారిటీతో ఆయ‌న గెలిచారు.  ఆర్జేడీ అభ్య‌ర్థి నాథ్ గ‌మిపై ఆయ‌న విజ‌యం సాధించారు. 2005 నుంచి సంజ‌య్‌.. ద‌ర్బంగా సీటులో గెలుస్తూనే ఉన్నారు. సంజ‌య్ స‌రోగి మొత్తం 67,248 ఓట్లు సాధించ‌గా, ప్ర‌త్య‌ర్థికి 59,093 ఓట్లు పోల‌య్యాయి.  ఇప్ప‌టి వ‌ర‌కు బీహార్‌లో 44 శాతం ఓట్ల‌ను లెక్కించారు. ఎన్డీఏ 133, మ‌హాగ‌ట్‌బంద‌న్ 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న‌ది.