ఆదివారం 31 మే 2020
National - May 11, 2020 , 20:20:21

గ్రామాల‌కు వైర‌స్ సోక‌కుండా చేయ‌డ‌మే పెద్ద స‌వాల్‌..

గ్రామాల‌కు వైర‌స్ సోక‌కుండా చేయ‌డ‌మే పెద్ద స‌వాల్‌..

 హైద‌రాబాద్‌: ప్ర‌ధాని మోదీ ఇవాళ ప‌లు రాష్ట్రాల సీఎంల‌తో వీడియోకాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్నారు.  లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇస్తున్న నేప‌థ్యంలో.. క‌రోనా వైర‌స్ గ్రామాల‌కు సోక‌కుండా చూసుకోవ‌డ‌మే అతిపెద్ద స‌వాల్ అన్నారు. కోవిడ్‌19 నుంచి ఇండియా త‌న‌ను తాను ర‌క్షించుకున్న‌ట్లు ప్ర‌పంచ దేశాలు భావిస్తున్నాయ‌ని, అయితే వైర‌స్ నియంత్ర‌ణ‌లో అన్ని రాష్ట్రాలు స‌హ‌క‌రించిన‌ట్లు మోదీ తెలిపారు. సోష‌ల్ డిస్టాన్సింగ్ పాటించ‌ని ప్రాంతాల్లో కేసులు పెరిగిన‌ట్లు ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మీరు ఇచ్చే స‌ల‌హాల మేర‌కే మ‌న భ‌విష్య‌త్తుకు మార్గం వేద్దామ‌ని సీఎంల‌తో మోదీ తెలిపారు. 

వ‌ల‌స‌కూలీల గురించి స్పందించిన ప్ర‌ధాని మోదీ.. ఇంటికి వెళ్లాల‌నుకున్న వారి ఆందోళ‌న‌ను అర్థం చేసుకోగ‌ల‌న్నారు. కానీ గ్రామాల‌కు వైర‌స్ వ్యాపించ‌కుండా చూసుకోవాల‌న్నారు. ఎక్క‌డి వారు అక్క‌డ ఉండ‌డ‌మే ఉత్త‌మం అని ఆయ‌న అన్నారు. స్వంత ఇంటికి వెళ్లాల‌నుకోవ‌డం మాన‌వ స‌హ‌జ‌మ‌ని, అందుకే కొన్ని రూల్స్ స‌డ‌లించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ నేప‌థ్యంలో వైర‌స్ .. గ్రామాల‌కు పాకకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. 


logo