గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 17:00:44

బిగ్ బాస్ సీజన్ - 4 జాబితా సిద్ధం?... కంటెస్టెంట్స్ ఎవరెవరో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ - 4 జాబితా సిద్ధం?... కంటెస్టెంట్స్ ఎవరెవరో తెలుసా?

హైదరాబాద్: రియాల్టీ షో బిగ్ బాస్ విజయవంతగా మూడు సీజన్లు పూర్తీ చేసుకొని నాలుగో సీజన్ కు సిద్దమవుతువుతున్నది. కరోనా సమయంలో బిగ్ బాస్ సీజన్ 4 షో జరుగుతుందా లేదా అనుమానాలకు తెరపడింది. అందుకు నిదర్శనంగా సోమవారం బిగ్ బాస్ సీజన్- 4 ప్రోమో విడుదలైంది. బిగ్ బాస్ సీజన్ 4 మరో రెండు వారాల్లో ప్రారంభం కావడం ఖాయంగానే కనిపిస్తున్నది. కరోనా వ్యాప్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పకడ్భందీగా బిగ్ బాస్ షో నిర్వహణకు చర్యలు చేపడుతున్నారు.

త్వరలోనే మొదలయ్యే ఈ షోలో కంటెస్టెంట్స్‌గా ఈ సారి మరింత స్టార్ క్యాస్ట్ యాడ్ చేయాలని చూస్తున్నది స్టార్ మా టీమ్ . దీనికోసం భారీగానే ఖర్చు చేసి మరీ పేరున్న వాళ్లనే బిగ్ బాస్ హౌజ్‌కు ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో 15 మంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ షోలో  సింగర్ సునీత,  పూనమ్ భజ్వా,శ్రద్దాదాస్, హంసా నందిని, మంగ్లీ (సింగర్), హీరో నందు, వైవా హర్ష, అఖిల్ సార్దక్, యామినీ భాస్కర్, మహాతల్లి, అపూర్వ, పొట్టి నరేష్ (జబర్దస్త్ కమెడియన్), మెహబూబా దిల్ సే (యూట్యూబ్ స్టార్), ప్రియ వడ్లమాని, సింగర్ నోయల్ లు పాల్గొంటున్నట్లు సమాచారం.  

తాజావార్తలు


logo