శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 15:53:06

స‌చిన్ పైల‌ట్‌కు ఉప‌శ‌మ‌నం

స‌చిన్ పైల‌ట్‌కు ఉప‌శ‌మ‌నం

జైపూర్ : రాజ‌స్థాన్ అసెంబ్లీ స్పీక‌ర్ నోటీసుల‌ను స‌వాలు చేస్తూ స‌చిన్ పైల‌ట్ తోపాటు మ‌రో 18 మంది రెబ‌ల్‌ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై హైకోర్టు నేడు విచార‌ణ చేప‌ట్టింది. నేటి విచార‌ణ సంద‌ర్భంగా సచిన్ పైలట్, అతని గ్రూప్ ఎమ్మెల్యేలకు హైకోర్టు పెద్ద‌ ఉపశమనం కలిగించింది. అసమ్మతి నోటీసులపై శాస‌న‌స‌భ స్పీక‌ర్ చర్యను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ విషయంపై కోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును కూడా రిజర్వు చేసింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు చేయడంతో పైలట్‌ను రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించిన సంగ‌తి తెలిసిందే. 


logo