శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Feb 23, 2021 , 15:13:26

బెంగళూరులో ప్రైవేటు టీచర్లు, సిబ్బంది భారీ నిరసన ర్యాలీ

బెంగళూరులో ప్రైవేటు టీచర్లు, సిబ్బంది భారీ నిరసన ర్యాలీ

బెంగళూరు : ట్యూషన్‌ ఫీజును తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది నిరసిస్తూ భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఘటన కర్ణాటకలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ విద్యా సంవత్సరం ప్రైవేటు స్కూల్స్‌ ట్యూషన్‌ ఫీజును 70 శాతమే మాత్రమే వసూలు చేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు టీచర్లు, యజమాన్యాలు, సిబ్బంది రాష్ట్ర రాజధాని బెంగళూరులో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. 

దాదాపు 3 వేల మంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది రోడ్లపైకి వచ్చి నిరసనలో పాల్గొన్నారు. కర్ణాటక ప్రైవేటు స్కూల్‌ మేనేజ్‌మెంట్‌, టీచింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ సంయుక్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. బెంగళూరు ప్రధాన రైల్వే స్టేషన్‌ నుంచి ప్రముఖ నిరసన ప్రదేశం ఫ్రీడమ్‌ పార్క్‌ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. ట్యూషన్‌ ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకోవాలని అదేవిధంగా టీచర్లకు గ్రాంట్లు విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు.  

VIDEOS

logo