శుక్రవారం 03 జూలై 2020
National - Jun 27, 2020 , 15:50:41

రూ.65కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టివేత

రూ.65కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టివేత

కుప్వారా : జమ్మూకశ్మీర్‌లో భారత ఆర్మీ, కుప్వారా పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి మాద్యక ద్రవ్యాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పట్టుబడిన 13.5 కిలోల మాదక ద్రవ్యాల విలువ రూ.65 కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇద్దరు నిందితులను బారాముల్లా జిల్లాలోని బిఝామా, లచ్చిపొరా నివాసి అయిన మంజూర్ అహ్మద్, జీహెచ్ మోహ్ద్ లోన్‌గా గుర్తించారు.

నిందితుల నుంచి రెండు పిస్టళ్లతోపాటు నాలుగు మ్యాగజైన్లు, 55 లైవ్ రౌండ్లు, నాలుగు హ్యాండ్ గ్రైనేడ్లు, పది డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరికి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలున్నాయని పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోయలో పని చేస్తున్న ఉగ్రవాదులకు మాదకద్రవ్యాలతో పాటు, ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై క్రల్‌పొర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా, విచారణ జరుపుతున్నట్లు అధికారులు వివరించారు.


logo