బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 15:45:38

ఢిల్లీలో డిగ్రీ, ఇంటర్ పరీక్షలు రద్దు

ఢిల్లీలో డిగ్రీ, ఇంటర్ పరీక్షలు రద్దు

న్యూఢిల్లీ : కరోనా వైరస్ రోజురోజుకు మరింతగా వ్యాప్తి చెందుతున్నందున.. డిగ్రీ, ఇంటర్ పరీక్షలను రద్ద చేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు .

ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు క్వారంటైన్ కేంద్రాలుగా మారాయి. ఇటువంటి పరిస్థితిలో పరీక్షలు నిర్వహించడం సాధ్యమయ్యే పనికాదని ఢిల్లీ ప్రభుత్వం భావించింది. దాంతో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పరీక్షలు నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో జరగాల్సిన చివరి సంవత్సరం పరీక్షలు కూడా ఉన్నాయి. ఢిల్లీ రాష్ట్రం పరిధిలోకి వచ్చే ఐపీ విశ్వవిద్యాలయం, అంబేద్కర్ విశ్వవిద్యాలయం, డీటీయూ, అన్ని ఇతర సంస్థల్లో పరీక్షలు ఉండవు.

ఢిల్లీలోని అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులకు పరీక్షలు ఉండవని, మునుపటి పరీక్షల మూల్యాంకనం ఆధారంగా విద్యార్థుల ఫలితాలను సిద్ధం చేస్తామని ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. ఈ ప్రభుత్వ నిర్ణయం మూడో సంవత్సరం విద్యార్థులకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. 

ప్రధాని మోడీకి కేజ్రీవాల్ లేఖ

అనుబంధ విశ్వవిద్యాలయం గురించి ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) తో సంబంధం ఉన్న కళాశాలల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం పరీక్షలపై సత్వర నిర్ణయం తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. చివరి సంవత్సరం పరీక్షలను విశ్వవిద్యాలయాల్లో సెప్టెంబర్ చివరిలో నిర్వహిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతకుముందు ఈ పరీక్షలు జూలైలో జరగాల్సి ఉంది. అయితే, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పరీక్షలను వాయిదా వేశారు. సెప్టెంబర్‌లో ఫైనల్ ఇయర్ పరీక్షకు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు తరువాత అవకాశం ఇస్తామని, అలాంటి విద్యార్థులకు పరిస్థితి సాధారణమైతే విశ్వవిద్యాలయం ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తుందని యూజీసీ స్పష్టం చేసింది.


logo