బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 20:53:59

రూ.72 కోట్ల సిగరెట్ల స్మగ్లింగ్‌ రాకెట్‌ గుట్టు రట్టు

రూ.72 కోట్ల సిగరెట్ల స్మగ్లింగ్‌ రాకెట్‌ గుట్టు రట్టు

జైపూర్ :రాజస్థాన్‌ కోటా లోని కర్మాగారం కేంద్రంగా నడుస్తున్న సిగరెట్ల స్మగ్లింగ్‌ రాకెట్‌ గుట్టును, 'డైరెక్టరేట్‌ ఆఫ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ ఇంటెలిజెన్స్‌' (డీజీజీఐ) ప్రధాన కార్యాలయం అధికారులు రట్టు చేశారు. ఈనెల 17వ తేదీన కోటా, నగౌర్‌లోని వివిధ ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. కర్మాగారంతోపాటు, వాణిజ్య సంస్థలు, గోదాములు, రహస్య  ప్రాంతాలు, అక్కడి నివాసాల్లోనూ తనిఖీలు జరిపారు. పన్నులు కట్టకుండా సిగరెట్ల సరఫరాకు సంబంధించిన పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.72 కోట్లకుపైగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ప్రాథమికంగా తేలింది. లాక్‌డౌన్‌ సమయంలోనూ సిగరెట్ల అక్రమ రవాణా జరిగినట్లు ఈ పత్రాల ద్వారా వెల్లడైంది. సీజీఎస్‌టీ చట్టం-2017 ప్రకారం, ఈ నెల 20వ తేదీన ఓ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతున్నది.


logo