బుధవారం 24 ఫిబ్రవరి 2021
National - Jan 23, 2021 , 13:16:56

మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు

మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు

ఛండీగఢ్‌: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం భారీ ప్రకటన చేశారు. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పంజాబ్ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. రైతు ఉద్యమంలో ఇప్పటివరకు దాదాపు 76 మంది చనిపోయారు. తన ఫేస్‌బుక్ లైవ్ ప్రోగ్రాం 'ఆస్క్ ది కెప్టెన్'లో ఈమేరకు కెప్టెన్‌ ఈ ప్రకటన చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీ శివారులో నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం 2020 సెప్టెంబర్‌లో ఈ మూడు చట్టాలను రూపొందించింది. ఈ చట్టాలు మధ్యవర్తుల పాత్రను తొలగిస్తాంచి, రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా విక్రయించడానికి అనుమతిస్తాయి. అయితే, ఈ మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకిగా ఉన్నాయంటూ పేర్కొంటున్న రైతులు వాటిని రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగారు. పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ చట్టాలను రూపొందించారని, వీటిని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

రైతు ఉద్యమంలో పాల్గొన్న పలువురు ఈ చట్టాలతో నష్టపోవాల్సి వస్తుందని ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 76 మంది చనిపోయినట్లు తెలుస్తున్నది. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ముందకొచ్చారు. వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు.

ఇది కూడా చదవండి..

చరిత్రలో ఈరోజు.. సాయుధ పోరాటంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మారు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo