మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 18, 2020 , 10:20:42

మోదీకి ఫోన్ చేసిన బైడెన్‌.. కంగ్రాట్స్ చెప్పిన ప్ర‌ధాని

మోదీకి ఫోన్ చేసిన బైడెన్‌.. కంగ్రాట్స్ చెప్పిన ప్ర‌ధాని

హైద‌రాబాద్‌: అమెరికా దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌తో  ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బైడెన్‌కు ఆయ‌న కంగ్రాట్స్ తెలిపారు.  అమెరికాతో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యానికి క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు బైడెన్‌తో మోదీ తెలిపారు. అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా ఎన్నికైన క‌మ‌లా హారిస్‌కు కూడా మోదీ కంగ్రాట్స్ చెప్పారు.  క‌మ‌లా గెలుపు భార‌తీయ‌, అమెరికా ప్ర‌జ‌ల‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని మోదీ అన్నారు.  బైడెన్‌తో జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌లో .. కోవిడ్ మ‌హ‌మ్మారి, వాతావ‌ర‌ణ మార్పులు, ఇండోప‌సిఫిక్ ప్రాంత స‌హ‌కారం లాంటి అంశాల‌ను కూడా చ‌ర్చించిన‌ట్లు మోదీ త‌న ట్వీట్‌లో తెలిపారు.   

బైడెన్‌, మోదీ మ‌ధ్య జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌పై అమెరికా కూడా ప్ర‌క‌ట‌న జారీ చేసింది.  స్వ‌దేశంలో, విదేశాల్లో ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోపేతం చేయ‌డమే ముఖ్య ఉద్దేశ‌మ‌ని అమెరికా త‌న ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది. ప్ర‌పంచ స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌ధాని మోదీతో క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ట్లు కొత్త అధ్య‌క్షుడు బైడెన్ ఆస‌క్తిగా ఉన్నార‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. బైడెన్ ట్రాన్‌షిష‌న్ టీమ్ ఈ ప్ర‌క‌ట‌న జార ఈచేసింది.  కంగ్రాట్స్ చెప్పిన మోదీకి బైడెన్ థ్యాంక్స్ చెప్పారు. అమెరికా డెమోక్రాట్లు త‌మ‌కు శ‌త్రువులు కారు అని భార‌త్ పేర్కొన్న‌ట్లు విదేశాంగ మంత్రి జైశంక‌ర్ తెలిపారు.