మంగళవారం 14 జూలై 2020
National - Jun 24, 2020 , 12:00:14

పెట్రో ధరల పెంపునకు నిరసనగా సైకిల్‌ కవాతు

పెట్రో ధరల పెంపునకు నిరసనగా సైకిల్‌ కవాతు

మధ్యప్రదేశ్‌ : పెట్రో ధరల పెంపునకు నిరసనగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌,  పార్టీ ఇతర నాయకులతో కలిసి సైకిల్‌ కవాతు నిర్వహించారు. భోపాల్‌లోని రోషన్‌పురా కూడలి నుంచి ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నివాసం వరకు  సైకిల్‌ కవాతు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వచ్చి ఇప్పటికే దేశ ప్రజలు ఆర్థికంగా, మానసికంగా చితికిపోతుంటే.. పెట్రో ధరలు కూడా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే పెట్రో ధరలు తగ్గించాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. 
logo