ఆదివారం 28 ఫిబ్రవరి 2021
National - Jan 20, 2021 , 08:07:12

గాజు సీసాలో జో బైడెన్‌..

గాజు సీసాలో జో బైడెన్‌..

భువనేశ్వర్‌: ఒడిశాకు చెందిన ఓ చిత్రకారుడు అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. భువనేశ్వర్‌కు చెందిన ఎల్‌ ఈశ్వర్‌ రావు ఓ చిన్న సీసాలో బైడెన్‌ చిత్రపటాన్ని గీశారు. మద్యం సీసాలో బైడెన్‌ చిత్రపటంతో మీనియేచర్‌ను సృష్టించారు. 


ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ నేడు ప్రమాణం చేయనున్నారు. 1971లో రాజకీయాల్లోకి ప్రవేశించిన బైడెన్‌.. అధ్యక్షుడు కావాలన్న ఐదు దశాబ్దాల తన కలను నేడు సాకారం చేసుకోనున్నారు.


బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11 గంటల సమయంలో) జరుగనున్న బైడెన్‌ ప్రమాణానికి రాజధాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌ భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది.    

VIDEOS

logo