గురువారం 02 జూలై 2020
National - Jun 27, 2020 , 12:15:50

బెంగళూరులో కెంపెగౌడ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ

బెంగళూరులో కెంపెగౌడ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ

కర్ణాటక : బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 108 అడుగుల ఎత్తయిన కెంపెగౌడ విగ్రహ నిర్మాణానికి గాను ముఖ్యమంత్రి  యాడ్యూరప్ప శనివారం భూమి పూజ చేసి ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ తదితరులు పాల్గొన్నారు. కెంపెగౌడ బెంగుళూరు నగర నిర్మాత. శ్రీ కృష్ణదేవరాయల కాలం నాటి సామంతుడైన కెంపెగౌడ 27 జూన్‌ 1510లో జన్మించారు. నేడు ఆయన మరణ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాలను బెంగుళూరులో నిరాడంబరంగా జరుపుకున్నారు. logo