ఆదివారం 09 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 18:39:27

కరోనా ఎఫెక్ట్‌ : భోపాల్ నగరం నిర్మానుష్యం

కరోనా ఎఫెక్ట్‌ : భోపాల్ నగరం నిర్మానుష్యం

భోపాల్‌ :  మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో కరోనా విజృంభిస్తుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం 10 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించింది. దీంతో ముస్లింలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్‌ (ఈద్‌-ఉల్‌- అద్హా) పర్వదినం రోజున నగర విధులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. భోపాల్‌ జిల్లా కలెక్టర్‌ అవినాశ్‌ లావాణియ ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. నగరంలోని ముస్లింలంతా ఇండ్లలోనే పండుగ జరుపుకొని ప్రభుత్వానికి చక్కగా సహరించారని, ఇది వారి తెహ్‌జీబ్‌ (మంచి ప్రవర్తన)కు నిదర్శమని ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ అమలు నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులు బలగాలను మోహరించారు. ఇదిలాఉండగా లాక్‌డౌన్‌ అమలును చాలామంది ముస్లింలు సమర్ధించారు. ‘కరోనా నేపథ్యంలో ప్రభుత్వం పలు నియమాలను సూచించింది. నిబంధనలకు అనుగుణంగా ఇండ్లలోనే పండుగ జరుపుకున్నాం. కాలగమనంలో పండుగలు వస్తూపోతూ ఉంటాయి. మన భద్రత అన్నింటికంటే ముఖ్యమైనది’ అని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.    


logo