మంగళవారం 07 జూలై 2020
National - Apr 08, 2020 , 09:17:24

కరోనా విధులు.. ఆ డాక్టర్‌కు కారే తాత్కాలిక నివాసం..

కరోనా విధులు.. ఆ డాక్టర్‌కు కారే తాత్కాలిక నివాసం..

భోపాల్‌ : కరోనా సోకిన రోగులకు ఎనలేని సేవలు చేస్తున్నారు వైద్యులు, నర్సులు. నిత్యం ఐసోలేషన్‌ వార్డుల్లో ఉండి.. రోగులకు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఐసోలేషన్‌ వార్డుల్లో పని చేస్తున్న డాక్టర్లు, నర్సుల కష్టంపై ఎన్ని ప్రశంసలు కురిపించినా తక్కువే. 

ఐసోలేషన్‌ వార్డులో పని చేస్తున్న ఓ డాక్టర్‌.. తన కారునే ఇల్లుగా మార్చుకున్నారు. ఎందుకంటే కరోనా నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని జేపీ ఆస్పత్రిలో డాక్టర్‌ సచిన్‌ నాయక్‌ విధులు నిర్వర్తిస్తున్నాడు. కరోనా సోకిన వారికి చికిత్స నిమిత్తం సచిన్‌ను ఐసోలేషన్‌ వార్డుకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ డాక్టర్‌ తన కుటుంబం గురించి కూడా ఆలోచించాడు. ఐసోలేషన్‌ వార్డులో పని చేసే డాక్టర్లు, నర్సులకు కరోనా వ్యాపించే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు డాక్టర్లు, నర్సులకు రోగుల నుంచి కరోనా వ్యాపించింది. దీంతో అప్రమత్తమైన డాక్టర్‌ సచిన్‌.. తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. తన కారునే ఇల్లుగా మార్చుకున్నాడు. ఆస్పత్రి ఆవరణలోనే తన కారులో ఏడు రోజుల నుంచి బస చేస్తున్నాడు. ఒకట్రెండు రోజుల్లో ఇంటికి వెళ్లి మళ్లీ విధులకు హాజరవుతానని డాక్టర్‌ చెప్పాడు. కుటుంబాన్ని కరోనా నుంచి దూరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సచిన్‌ నాయక్‌ స్పష్టం చేశారు. 


logo