మంగళవారం 14 జూలై 2020
National - Jun 20, 2020 , 20:21:57

భోపాల్‌లో రికార్డుస్థాయి వర్షపాతం నమోదు

భోపాల్‌లో రికార్డుస్థాయి వర్షపాతం నమోదు

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని భోపాల్‌ నగరంలో గడిచిన మూడురోజుల్లో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారి హెచ్‌ఎస్‌ పాండే శనివారం తెలిపారు. మూడురోజులుగా ఇక్కడ 32సెంటిమీటర్ల వర్షం కురిసిందని, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులను ఇది చెరిపేసిందని పేర్కొంది. భోపాల్‌లో చాలా ఏండ్లుగా జూన్‌ నెలలో ఈ స్థాయి వర్షపాతం నమోదు కాలేదని, జూన్‌లో ఇక్కడ సాధారణ వర్షపాతం 16 సెంటిమీటర్లేనని ఈ సారి రెట్టింపు నమోదైందని ఆయన వెల్లడించారు. రానున్న 48గంటల్లోనూ ఇక్కడ భారీగా వర్షం కురిసే అవకాశముందని తెలిపారు. గడిచిన 24గంటల్లో ఇక్కడ 7సెంటీమీటర్ల వర్షం కురిసిందని, జూలై పూర్తయ్యేందుకు ఇంకా పది రోజుల సమయం మిగిలి ఉండడంతో వర్షాలు మరింత కురిసే అవకాశముందన్నారు.


logo