మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 05, 2020 , 16:03:52

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు చెందిన కాలేజీ భవనం కూల్చివేత

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు చెందిన కాలేజీ భవనం కూల్చివేత

భోపాల్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు చెందిన కాలేజీ భవనాన్ని అధికారులు కూల్చివేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్‌ నిర్మించిన ఐపిఎస్ కళాశాల భవనాన్ని కూల్చివేతకు భోపాల్‌ మున్సిపల్‌ అధికారులు ప్రయత్నించగా గతంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రధాన భవనం కూల్చివేతపై జిల్లా కోర్టు 2005లో స్టే ఇచ్చింది. మరోవైపు ఆ కాలేజీ ప్రాగణంలోని 12 వేల చదరవు అడుగుల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మించినట్లు అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గురువారం దానిని కూల్చివేశారు. ఈ సందర్భంగా అక్కడ పోలీసులను భారీగా మోహరించారు. అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలనే కూల్చివేసినట్లు అసిస్టెంట్‌ ఇంజినీర్‌ తెలిపారు. కోర్టు స్టే ఇచ్చిన ప్రధాన భవనం జోలికి తాము వెళ్లలేదని ఆయన చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.