మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 08:15:12

41కిచేరిన భీవండి మృతులు

41కిచేరిన భీవండి మృతులు

ముంబై: మ‌హారాష్ట్ర‌లోని భీవండిలో మూడంత‌స్థుల‌ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. థానే జిల్లాలోని భీవండిలో ప‌టేల్ కాంపౌండ్ ప్రాంతంలో ఉన్న మూడంత‌స్థుల భ‌వ‌నం సోమ‌వారం తెల్లవారుజామున 3.40 గంట‌ల‌కు కూలిన విష‌యం తెలిసిందే. థానేలో గ‌త కొన్నిరోజులుగా కురుస్తున్న వాన‌ల‌తో 43 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ భ‌వ‌నం కూలిపోయింద‌ని అధికారులు తెలిపారు.    

మూడు రోజులుగా కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు వాన‌ల‌తో ఆటంకం క‌లుగుతున్న‌ది. దీంతో థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, ఎన్డీఆర్ఎఫ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ పనులు నెమ్మ‌దిగా కొనసాగిస్తున్నాయి. సుమారు వంద మందికిపైగా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. రెండేండ్ల చిన్నారి స‌హా మ‌రో వ్య‌క్తి ఆచూకీ ల‌భించ‌డం లేద‌ని, వారికోసం శిథిలాల తొల‌గింపు చ‌ర్య‌లు కొన‌సాగుతాయ‌ని అధికారులు తెలిపారు.   


logo