శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 01:01:43

కోరేగావ్‌-భీమాపై పవార్‌కు సమన్లు

కోరేగావ్‌-భీమాపై పవార్‌కు సమన్లు

పుణె: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌కు సమన్లు జారీ చేయాలని కోరేగావ్‌-భీమా విచారణ కమిషన్‌ నిర్ణయించింది. 2018లో జరిగిన కోరేగావ్‌-భీమా అల్లర్లపై బీజేపీ సారథ్యంలోని నాటి రాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ జేఎన్‌ పటేల్‌ సారథ్యంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అదే ఏడాది అక్టోబర్‌ 8న కమిషన్‌ ముందు శరద్‌ పవార్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు.  కోరేగావ్‌-భీమా అల్లర్లపై మీడియాలో పవార్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ను విచారించాలని  వివేక్‌ విచార్‌మంచ్‌ సభ్యుడు సాగర్‌ షిండే.. కమిషన్‌ ముందు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 18న పవార్‌ మీడియాతో మాట్లాడుతూ.. హిందూత్వ కార్యకర్తలు మిలింద్‌ ఎక్బోటె, శంభాజీ భిడే 2018 అల్లర్ల సందర్భంగా కోరేగావ్‌-భీమాలో రెచ్చగొట్టే వాతావరణం సృష్టించారన్నారు. నాటి అల్లర్లలో హిందూత్వ సంస్థల పాత్రను కొట్టి పారేయలేమని, అయితే, దీనిపై దర్యాప్తు సంస్థలే నిగ్గు తేల్చాలని స్పష్టం చేశారు.  
logo