శుక్రవారం 29 మే 2020
National - Jan 17, 2020 , 02:33:38

భీమ్‌ ఆర్మీ అధినేత ఆజాద్‌కు బెయిల్‌

భీమ్‌ ఆర్మీ అధినేత ఆజాద్‌కు బెయిల్‌
  • శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం అడ్డుకోరాదని స్పష్టీకరణ
  • రవీంద్రనాథ్‌ టాగోర్‌ కవితను చదివి వినిపించిన జడ్జి

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో ప్రజలను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై గత నెల 20న అరెస్టయి, జైలు లో ఉన్న భీమ్‌ ఆర్మీ అధినేత చంద్రశేఖర్‌ ఆజాద్‌కు ఢిల్లీలోని స్థానిక కోర్టు బుధవారం బెయి ల్‌ మంజూరు చేసింది. నాలుగు వారాల వరకు ఢిల్లీకి రావద్దదని ఆయనపై కోర్టు ఆంక్షలు విధించింది. గత నెల 20న ఢిల్లీలో జరిగిన హింసలో ఆజాద్‌ పాత్ర ఉందని రుజువు చేసే సీసీటీవీ ఫుటేజీలో లేదా ఆడియో రికార్డులో ఏ ఆధారాల్లేవని, దీన్ని పోలీసులూ అంగీకరించా రని అదనపు సెషన్స్‌ జడ్జి కామినీ లావ్‌ పేర్కొన్నారు. దేశంలో అరాచకత్వాన్ని అనుమతించలేమన్నారు.

‘ఎక్కడ మనస్సు భయం లేకుం డా ఉంటుందో’ అన్న రవీంద్రనాథ్‌ టాగోర్‌ కవితను జడ్జి వినిపించారు. 1900లో బ్రిటిష్‌ వారు భారత్‌లో విభజించు-పాలించు అన్న విధానాన్ని అనుసరిస్తున్నప్పుడే టాగోర్‌ ప్ర జల మనస్సుల్లో భయంలేని భారత్‌ గురించి కల కన్నారన్నారు. శాంతియుత నిరసన తెలిపే పౌరుల ప్రాథమిక హక్కును ప్రభుత్వం అడ్డుకోరాదని పేర్కొన్నారు. శాంతియుత నిరసన తెలుపుతున్నప్పుడు ఇతరుల హక్కులకు భం గం కలుగకుండా ఉండాలని జడ్జి సూచించారు. కాగా, చంద్రశేఖర్‌ ఆజాద్‌ గురువారం బెయిల్‌పై విడుదలయ్యారు.


logo