శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 09:44:10

భ‌క్తులెవ‌రు లేకుండానే భ‌స్మ హార‌తి..

భ‌క్తులెవ‌రు లేకుండానే భ‌స్మ హార‌తి..

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో..  దేశంలో అనేక ఆంక్ష‌లు విధిస్తున్నారు.  ఇప్ప‌టికే అనేక రాష్ట్రాలు సామూహిక కార్య‌క్ర‌మాల‌ను ర‌ద్దు చేశాయి.  ప్ర‌ఖ్యాత ఆల‌యాలు కూడా కొన్ని గైడ్స్‌లైన్స్ జారీ చేశాయి. భ‌క్తులు భారీ సంఖ్య‌లో రాకుండా ఉండేందుకు సూచ‌న‌లు చేశాయి.  ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యినిలో ఉన్న మ‌హాకాలేశ్వ‌రుడి ఆల‌యంలో ఇవాళ భ‌క్తులు లేకుండానే భ‌స్మ హార‌తి నిర్వ‌హించారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యాన్ని భ‌క్తుల సంద‌ర్శ‌న‌కు మూసివేశారు. కానీ అర్చ‌కులు మాత్రం మ‌హాకాళేశ్వ‌రుడికి ప్రాత‌కాల స‌మ‌యంలో భ‌స్మ హార‌తి ఇచ్చారు.  పంజాబ్‌లో ఉన్న గోల్డెన్ టెంపుల్ వ‌ద్ద కూడా ఆంక్ష‌లు విధించారు.  అమృత్‌స‌ర్‌లో ఆల‌య సంద‌ర్శ‌న‌కు వ‌స్తున్న భ‌క్తులకు గురుద్వారా ప్ర‌బంద‌క్ క‌మిటీ శానిటైజ‌ర్ల‌ను అంద‌జేసింది.   


logo