సోమవారం 18 జనవరి 2021
National - Dec 04, 2020 , 13:02:37

దూసుకెళుతున్న ఎయిర్ టెల్...

  దూసుకెళుతున్న ఎయిర్ టెల్...

ఢిల్లీ :సెప్టెంబర్ నెలలోనూ ఎయిర్టెల్ తన సత్తా చాటుకున్నది. వరుసగా రెండో నెలలోనూ వినియోగదారులను ఆకట్టుకోగలిగింది. టెలికం రిగ్యులేటరీ సంస్థ ట్రాయ్‌ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం వొడాఫోన్‌ ఐడియా 4.6 మిలియన్ల మంది కష్టమర్లను కోల్పోయింది. సెప్టెంబర్‌లో 3.8 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకున్నది. ఈ బాటలో రిలయన్స్‌ జియో 1.5 మిలియన్లమంది వినియోగదారులను కొత్తగా సంపాదించింది. రిలయన్స్‌ జియోతో పోలిస్తే సెప్టెంబర్‌లో ఎయిర్‌టెల్‌ రెట్టింపునకుపైగా యూజర్లను ఆకట్టుకోగలిగింది.

కొత్తగా కస్టమర్లను పొందడంలో వరుసగా రెండో నెలలోనూ జియోను మించిన స్పీడ్‌ను ఎయిర్‌టెల్‌ చూపింది. సెప్టెంబర్‌లో వైర్‌లైన్‌ విభాగంలో జియో 3,03,205 యూజర్లను, ఎయిర్‌టెల్‌ 66,335 వినియోగదారులనూ జత కలుపుకున్నాయి. దీంతో ఎయిర్‌టెల్‌ వైర్‌లైన్‌ వినియోగదారుల సంఖ్య 4.4 మిలియన్లను తాకగా.. రిలయన్స్‌ జియో వైర్‌లైన్‌ సబ్‌స్క్రైయిబర్లు 2.1 మిలియన్లకు చేరింది. కాగా.. దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రయిబర్ల సంఖ్య సెప్టెంబర్‌లో 1.4 శాతం వృద్ధితో 72.63 కోట్లకు చేరింది. ఈ విభాగంలో రిలయన్స్ జియో మార్కెట్‌ వాటా 55.9 శాతంకాగా.. 22.9 శాతంతో ఎయిర్‌టెల్‌ ద్వితీయ ర్యాంకులో నిలిచింది. వొడాఫోన్‌ ఐడియా మార్కెట్‌ వాటా 16.5 శాతంగా నమోదైంది.

సెప్టెంబర్‌ చివరికల్లా రిలయన్స్‌ రిలయన్స్‌ జియో మొబైల్‌ వినియోగదారుల సంఖ్య 0.36 శాతం పుంజుకుని 40.41 కోట్లను తాకింది. ఇక ఎయిర్‌టెల్‌ యూజర్ల సంఖ్య 1.17 శాతం వృద్ధితో 32.66 కోట్లకు చేరింది. వొడాఫోన్‌ ఐడియా 4.7 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను కోల్పోవడం ద్వారా 29.55 కోట్ల సంఖ్యకు పరిమితమైంది. దీంతో 35.1 శాతం మార్కెట్‌ వాటాతో రిలయన్స్‌ జియో అగ్రస్థానంలో నిలవగా.. 28.4 శాతం వాటాతో ఎయిర్‌టెల్‌ రెండో ర్యాంకును పొందింది. వొడాఫోన్‌ ఐడియా 25.7 శాతం మార్కెట్‌ వాటాతో తదుపరి స్థానాన్ని కైవసం చేసుకుంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.