శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 16:17:20

రాహుల్‌గాంధీపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

రాహుల్‌గాంధీపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీ ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘించాడంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి (ఈసీఐ) బీజేపీ ఫిర్యాదు చేసింది. అక్టోబ‌ర్ 28న బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా తొలి విడుత పోలింగ్ జ‌రుగుతున్నద‌ని, ఇలాంటి సంద‌ర్భంలో రాహుల్‌గాంధీ ట్విట్ట‌ర్ ద్వారా ఓట్ల‌ను అర్థించార‌ని, ఇది ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంద‌ని బీజేపీ త‌న ఫిర్యాదులో పేర్కొన్న‌ది. రాహుల్‌గాంధీపై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈసీని కోరింది. 

న్యాయం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రైతుల సంక్షేమం కోసం ఈ సారి క‌చ్చితంగా మ‌హా కూట‌మికే ఓటేయాల‌ని బుధవారం రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. అయితే, ఇదేరోజు బీహార్‌లో తొలి విడుత ఎన్నిక‌ల్లో భాగంగా కొన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ జ‌రుగుతున్న‌ది. పోలింగ్ జ‌రుగుతుండ‌గా రాహుల్‌గాంధీ ఓట్ల‌డ‌గ‌డం ఎన్నిక‌ల నియమావ‌ళి ఉల్లంఘన కింద‌కే వ‌స్తుంద‌ని, అత‌నిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీజేపీ ఈసీకి లేఖ రాసింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.