న్యూఢిల్లీ: ఇప్పటికే అన్ని కరోనా వైరస్ వేరియంట్లపై సమర్థంగా పని చేస్తున్నట్లు కొవాగ్జిన్‌కు సర్టిఫికెట్ ఇచ్చాయి పలు అధ్యయనాలు. తాజాగా ఈ వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ కూడా ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలను డీసీజీఐకి చెందిన ఎక్స్పర్ట్ కమిటీకి సమర్పించింది. దీనిపై కమిటీ పరిశీలన జరిపి ఆమోదించింది. అయితే మూడో దశ ప్రయోగాల్లో కొవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతంగా తేలినట్లు సమాచారం.