గురువారం 21 జనవరి 2021
National - Jan 12, 2021 , 17:14:42

ఉచితంగా 16.5 ల‌క్ష‌ల డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్లు

ఉచితంగా 16.5 ల‌క్ష‌ల డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్లు

న్యూఢిల్లీ: భార‌త్ బ‌యోటెక్ 16.5 ల‌క్ష‌ల కొవాగ్జిన్ వ్యాక్సిన్ల‌ను ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది. హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ త‌న వ్యాక్సిన్ ఒక్కో డోసును రూ.295కు ప్ర‌భుత్వానికి అమ్ముతోంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఆరోగ్యశాఖ వివ‌ర‌ణ ఇచ్చింది. 16.5 ల‌క్ష‌ల డోసులు ఉచితంగా ఇచ్చిన త‌ర్వాత మ‌రో 38.5 ల‌క్ష‌ల డోసులు ఒక్కోదానికి రూ.295 వ‌సూలు చేస్తోంద‌ని ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఆ లెక్క‌న మొత్తం 55 ల‌క్ష‌ల డోసుల‌కు తీసుకుంటే.. ఒక్కో డోసు ఖరీదు రూ.206 మాత్ర‌మే అవుతుంద‌ని తెలిపింది. ఈ నెల 14లోపు 100 శాతం వ్యాక్సిన్ డోసులు అంద‌నున్న‌ట్లు చెప్పింది. అంటే సీర‌మ్ నుంచి 55 ల‌క్ష‌ల కొవిషీల్డ్ వ్యాక్సిన్లు, భార‌త్ బ‌యోటెక్ నుంచి 55 ల‌క్ష‌ల కొవాగ్జిన్లు క‌లిపి మొత్తం కోటి 10 ల‌క్ష‌ల డోసులు రానున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. 


logo