ఆదివారం 17 జనవరి 2021
National - Dec 22, 2020 , 13:28:13

13వేల మందికి కొవాగ్జిన్‌ టీకా : భారత్‌ బయోటెక్‌

13వేల మందికి కొవాగ్జిన్‌ టీకా : భారత్‌ బయోటెక్‌

హైదరాబాద్‌ : కరోనా వ్యాక్సిన్‌ మూడో విడత క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటి వరకు 13వేల మంది వలంటీర్లకు ‘కొవాగ్జిన్‌’ టీకా ఇచ్చినట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. మొత్తం 26వేల మంది వలంటీర్లకు టీకా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించుకొని.. ముందుకు సాగుతోంది. ఇందులో సగం మేర లక్ష్యం చేరడంపై కంపెనీ హర్షం వ్యక్తం చేసింది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను తయారు చేస్తోంది. మొదటి, రెండో విడత ట్రయల్స్‌ వ్యాక్సిన్‌ మెరుగైన ఫలితాలు చూపడంతో డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్ ఇండియా మూడో విడత ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో నవంబర్‌ మధ్యలో ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి.

భారతదేశంలో భారీ ఎత్తున ట్రయల్స్‌ నిర్వహించడం ఇదే మొదటిసారి. కొవిడ్‌-19 మహమ్మారికి సురక్షితమైన, సమర్థవంతమైన స్వదేశీ వ్యాక్సిన్‌ను తీసుకురావడానికి సహకరించిన వలంటీర్లకు భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా కృతజ్ఞతలు తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్న అభ్యర్థుల్లో ప్రతిరక్షకాలను ప్రేరేపించాయని, తీవ్రమైన ప్రతికూల సంఘటనలు నమోదు చేయలేదని మొదటి దశ ట్రయల్స్‌ మధ్యంతర ఫలితాలను ఇటీవల సంస్థ వెల్లడించింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో వచ్చిన సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎలాంటి మందులు అవసరం లేకుండానే తగ్గిపోయినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఫేజ్‌ 1 ట్రయల్స్‌ మధ్యంతర ఫలితాల ప్రకారం.. టీకా రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు.. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ చూపలేదని పేర్కొంది. 


ఇవి కూడా చదవండి..

ప‌బ్‌లో రెయిడ్‌.. సురేశ్ రైనా అరెస్టు
ప్రాణం తీసిన జొన్నరొట్టెలు..సంగారెడ్డిలో విషాదం
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. తొలిసారిగా 20వేల దిగువకు
ప్రధాని మోదీకి అమెరికా అత్యున్నత పురస్కారం