హైదరాబాద్: ఇండియన్ మేడ్ కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఆలస్యం కావడంపై దానిని అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ మంగళవారం స్పందించింది. సాధ్యమైనంత త్వరగా కొవాగ్జిన్‌కు అనుమతి పొందే దిశగా తాము డబ్ల్యూహెచ్‌వోతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. ఓ బాధ్యతాయుతమైన తయారీదారుగా, గతంలో ఇతర వ్యాక్సిన్లకు లభించిన అనుమతుల ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతిపై ఎలాంటి కామెంట్ చేయదలచుకోవడం లేదు. సాధ్యమైనంత త్వరగా అత్యవసర వినియోగ అనుమతి కోసం డబ్ల్యూహెచ్‌వోతో కలిసి పని చేస్తున్నామని భారత్ బయోటెక్ చెప్పినట్లు ఇండియా టుడే వెల్లడించింది.
ఆరోగ్య సంబంధిత అంశాలపై రిపోర్టింగ్ చేసే సమయాల్లో సంయమనం పాటించాలని మీడియాను కోరుతున్నట్లు భారత్ బయోటెక్ చెప్పింది. ఈ అనుమతుల విషయమై సరైన సమయంలో తాము అధికారిక ప్రకటన చేస్తామని తెలిపింది. కొవాగ్జిన్ అనుమతి ప్రక్రియను డబ్ల్యూహెచ్‌వో మరింత ఆలస్యం చేయనుందన్న వార్తల నేపథ్యంలో భారత్ బయోటెక్ ఈ ప్రకటన చేసింది.