బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 16:26:52

భారత్‌-పాక్‌ బార్డర్‌లో సైనికుల స్టెప్పులు.. షేర్‌ చేసిన సెహ్వాగ్‌

భారత్‌-పాక్‌ బార్డర్‌లో సైనికుల స్టెప్పులు.. షేర్‌ చేసిన సెహ్వాగ్‌

స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా చ‌ర్య‌ల్లో భాగంగా జ‌వాన్లు కాసేపు కూడా విశ్రాంతి తీసుకోరు. ‌దేశాన్ని ఎప్పుడూ ఓ కంట క‌నిపెట్టే ఉంటారు. అలాంటి జ‌వాన్ల‌కు కూడా అప్పుడ‌ప్పుడు కాస్త వినోదం ఉండాలి. స‌వాలు విసిరే ప‌రిస్థితుల్లో కూడా ఆనందించే ధైర్యం కొంత‌మందికి మాత్ర‌మే ఉంటుంది. అది సైనికుల‌కే సాధ్యం.

ఇండో-పాక్ స‌రిహ‌ద్దుకు ద‌గ్గ‌ర‌లో జ‌వాన్లంద‌రూ క‌లిసి భాంగ్రా డ్యాన్స్ చేస్తున్న‌ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న‌ది. ఆనందంతోపాటు అద్బుత‌మైన శ‌క్తిని చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. జై జ‌వాన్! అంటూ సైనికుల భాంగ్రా వీడియోను క్రికెట‌ర్ వీరేందర్ సెహ్వాగ్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.  వీరి డ్యాన్స్ చూస్తుంటే ఎవ‌రో కొరియోగ్ర‌ఫీ చేసిన‌ట్లుగా ఉంది. అంత బాగా చేశారు. ఒక‌సారి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించే అద్భుతంగా చేశారు. logo