శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 20:39:16

రామయ్య హుండీ ఆదాయం రూ. 66.5 లక్షలు

రామయ్య హుండీ ఆదాయం రూ. 66.5 లక్షలు

భద్రాద్రి కొత్తగూడెం : శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీల ఆదాయాన్ని సోమవారం చిత్రకూట మండపంలో లెక్కించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్స్‌తోపాటు సెక్యూరిటీ గార్డుల భద్రత నడుమ 152 రోజుల ఆదాయాన్ని ఆలయ సిబ్బందితో పాటు భక్తులు లెక్కించారు. నగదు రూపంలో రూ.66,51,895  ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. అదేవిధంగా 80 గ్రాముల బంగారం, కేజీ 200 గ్రాముల వెండి భక్తులు కానుకలుగా సమర్పించాచినట్లు వెల్లడించారు. కొవిడ్ కారణంగా భక్తుల రాక తగ్గడంతో ఆలయ ఆధాయం తగ్గిందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన ఆలయంలో హుండీలు, ఉపాలయాలలో హుండీలను లెక్కించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.