శనివారం 04 జూలై 2020
National - Jun 28, 2020 , 21:18:32

టిక్‌టాక్‌తో జాగ్రత్త..!

టిక్‌టాక్‌తో జాగ్రత్త..!

న్యూఢిల్లీ : చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్‌ యూజర్ల సమాచారాన్ని మొత్తం కాపీ చేస్తోందట. ఈ విషయాన్ని ఐఫోన్‌ ఐవోఎన్‌14 సాఫ్ట్‌వేర్‌ బయటపెట్టింది. ఐఫోన్‌లోని కీ ప్యార్డ్‌పై టైప్‌ చేసే ప్రతీ పదాన్ని టిక్‌టాక్‌ కాపీ చేస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు టిక్‌టాక్‌ ద్వారా చాలా హైప్రొఫైల్‌ యాప్‌లు వినియోగదారుల సమాచారాన్ని కాపీ చేస్తూ దొరికిపోయాయి. ఇటువంటి యాప్‌ను నిలిపివేస్తామని టిక్‌టాక్‌ ఇటీవల ప్రకటించింది. కానీ అది ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు.

ఐవోఎస్‌ క్లిప్‌ బోర్డులో వినియోగదారుడు ఒక మెసేజ్‌ను ఒక యాప్‌ నుంచి కాపీ చేసి వేరొక యాప్‌లోకి పేస్ట్‌ చేస్తాడు. అలా కాపీ, పేస్ట్‌ చేసే సమాచారాన్ని వేరే ఏదైనా యాప్‌.. ఆ సమాచారాన్ని కాపీ చేస్తే దానిని యాపిల్‌ కొత్త సాఫ్ట్‌వేర్‌ గుర్తిస్తుందట. దీనికి సంబంధించిన ఓ వీడియోను జెర్మె బర్గ్‌ అనే ఎమోజీ హిస్టోరియన్‌ తన ట్వీటర్‌లో పోస్టు చేశాడు.logo