గురువారం 28 మే 2020
National - May 11, 2020 , 17:57:38

ఆన్‌లైన్‌ గిప్ట్‌ల పేరిట సైబర్‌ నేరగాళ్ల దోపిడీ

ఆన్‌లైన్‌ గిప్ట్‌ల పేరిట  సైబర్‌ నేరగాళ్ల దోపిడీ

హైదరాబాద్‌:  సైబర్ చీటర్లు అమాయకులను దోచుకునేందుకు అవకాశమున్న అన్ని మార్గాలను ఎంచుకుంటున్నారు.   రోజుకు ఒక్కరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. కొందరు అప్రమత్తతతో జాగ్రత్తగా ఉంటే.. మరికొందరు ఆశకు పోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్ చేసేవారి డాటాను చోరీచేస్తూ గిఫ్ట్‌లు, లాటరీల పేరుతో చీటర్లు టోకరా వేస్తున్నారు.

షాప్‌క్లూస్‌లో  బహుమతి వచ్చిందంటూ బహదూర్‌పురా వాసికి సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేశారు. గిఫ్ట్‌ డెలివరీకి ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలని ఓ అకౌంట్‌ నెంబర్‌ను సైబర్‌ ముఠా పంపించింది. గిఫ్ట్‌ వస్తుందన్న ఆశతో కుమార్‌ అనే వ్యక్తి రూ.39వేలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


logo