సోమవారం 28 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 13:26:08

డీజే హళ్లీ, కేజీ హళ్లీ పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ పొడిగింపు

డీజే హళ్లీ, కేజీ హళ్లీ పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ పొడిగింపు

బెంగళూరు : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి బంధువు ఓ వర్గంపై సోషల్‌ మీడియాలో చేసిన పోస్టుతో మంగళవారం రాత్రి బెంగళూర్‌లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో పలు ప్రాంతాలతో పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. డీజే హళ్లీ, కేజీ హళ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ఫ్యూను ఆగస్టు 15 ఉదయం 6 గంటల వరకు పొడిగించారు. నలుగురు కంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడితే కేసులు నమోదు చేస్తామని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ హెచ్చరించారు.

హింసకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 మంది ప్రధాన నిందితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకుముందు కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. బెంగళూరులో జరిగిన హింసాత్మక ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ విచారణ జరుపుతున్నారని, పోలీసులపై రాళ్లు రువ్వినట్లు, దాడి చేసినట్లు ఆరోపణలున్న146 మందిని అరెస్టు చేశామని చెప్పారు. ఓ వర్గాన్ని అవమానిస్తూ  సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే ఆరోపణపై నవీన్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
logo