మంగళవారం 02 జూన్ 2020
National - May 20, 2020 , 16:33:41

భారీ శ‌బ్ధాల‌తో ఉలిక్కిప‌డ్డ బెంగుళూరు..

భారీ శ‌బ్ధాల‌తో ఉలిక్కిప‌డ్డ బెంగుళూరు..


హైద‌రాబాద్‌:  అంతుచిక్క‌ని భారీ శ‌బ్ధాలు ఇవాళ బెంగుళూరు ప్ర‌జ‌ల్ని భ‌య‌బ్రాంతుల‌కు గురి చేశాయి.  అత్యంత ర‌హ‌స్యంగా మారిన ఆ శ‌బ్ధాల గురించి ఇంకా ఎటువంటి వివ‌ర‌ణ అంద‌లేదు. ఇవాళ మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌న్న‌ర స‌మ‌యంలో.. బెంగుళూరులోని కొన్ని ప్రాంతాల్లో భారీ శ‌బ్ధాలు వినిపించాయి.  వైట్‌ఫీల్డ్‌, ఎల‌క్ట్రానిక్స్ సిటీ, హెచ్ఏఎల్‌, హెచ్ఎస్ఆర్ లే ఔట్ ప్రాంతంలో ఆ శ‌బ్ధాలు చ‌వుల‌కు చిల్లులుప‌డేలా చేశాయి. దీనిపై కొంద‌రు నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో వీడియోల‌ను పోస్టు చేశారు. కొంద‌రు త‌మ ఇండ్ల‌ల్లో కిటికీలు కూడా ఊగిన‌ట్లు ఆరోపించారు. కానీ ఆధారం లేని ఆ శ‌బ్ధాల‌పై ప్ర‌భుత్వం కూడా స్పందించ‌లేదు.  అది మాత్రం భూకంపం కాదు అని అధికారులు చెప్పారు. సెసిమోమీట‌ర్లు ఆ ప్ర‌కంప‌న‌ల‌ను గుర్తించ‌లేద‌ని డిజాస్ట‌ర్  మానిట‌రింగ్ అధికారి చెప్పారు. భూమి నుంచి ఎటువంటి ప్ర‌కంప‌న‌లు లేవ‌న్నారు.  ఆ శ‌బ్ధాల‌కు త‌మ‌కు ఎటువంటి సంబంధం లేద‌ని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా చెప్పింది. త‌మ‌కు ఎటువంటి కాల్స్ అంద‌లేద‌ని పోలీసు క‌మిష‌న‌ర్ తెలిపారు.  వింత‌గా మారిన  ఆ శ‌బ్ధాల గురించి ఇంకా మిస్ట‌రీ వీడాల్సి ఉన్న‌ది. 


logo