మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 17:48:57

బెంగ‌ళూరులో 5,598 కంటైన్మైంట్ జోన్లు

బెంగ‌ళూరులో 5,598 కంటైన్మైంట్ జోన్లు

కర్ణాట‌క‌ : క‌రోనా మ‌హ‌మ్మారి క‌ర్ణాట‌క‌లో రోజు రోజుకి విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 15, 16వ తేదీల్లో ఒక్క బెంగ‌ళూరులోనే 369 కోవిడ్‌-19 కేసులు న‌మోద‌య్యాయి. అదే రాష్ర్ట వ్యాప్తంగా 4,196 తాజా కేసులు న‌మోద‌య్యాయి. గురువారం ఒక్క‌రోజే రాష్ర్టంలో 2,344 మంది క‌రోనా వైర‌స్ భారిన ప‌డ్డారు. దీంతో యాక్టివ్ కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 3,452 నుంచి 5,598కి పెరిగింది. ఈ నివేదిక‌ను బృహ‌త్ బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలిక బుధ‌వారం నాడు విడుద‌ల చేసింది. కాగా తాజా బులిటెన్ ప్ర‌కారం బెంగ‌ళూరులో ఇప్ప‌టివ‌ర‌కు ఏర్పాటైన కంటైన్మెంట్ జోన్ల సంఖ్య‌ 7,053గా ఉంది. 

జూలై 15 నాటికి 6,371 వీధులు, 621 అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లను కంటైన్మైంట్ జోన్లుగా గుర్తించారు. కోవిడ్‌-19 రోగుల నివాసాలు ఉన్న వీధులను కంటైన్మైంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు. అదేవిధంగా అపార్ట్ మెంట్ కాంప్లెక్స్‌లలో క‌రోనా రోగి ఉన్న ఫ్లాట్ మొత్తం అంతస్తు కాకుండా క్రింద, పైన ఉన్న అంతస్తులు కూడా కంటెమెంట్ జోన్‌లుగా గుర్తించబడ్డాయి. 


logo