గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 18:02:54

పెట్రోల్‌ పోయించుకుంటే బిర్యానీ ఫ్రీ..

పెట్రోల్‌ పోయించుకుంటే బిర్యానీ ఫ్రీ..

బెంగళూరు : బిర్యానీ ప్రియులకు అదిరిపోయే వార్తే ఇది. పెట్రోల్‌ పోయించుకున్న వినియోగదారులకు బిర్యానీ అందజేస్తున్నది ఓ బ్యాంకు యాజమాన్యం. బెంగళూరు ఓల్డ్ మద్రాస్ రోడ్డులోని ఇందిరానగర్ ఆర్టీఓకు సమీపంలో ఉన్న వెంకటేశ్వర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సర్వీస్ స్టేషన్ సోమవారం నుంచి తన వినియోగదారులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 5 గంటల మధ్య కాంప్లిమెంటరీ ఫుడ్ ప్యాకెట్లను అందిస్తుంది. ఇంధన అవుట్లెట్ గోల్డెన్‌ జూబ్లీ సందర్భంగా.. దాని గ్రూప్ రెస్టారెంట్ మేనకా ఫుడ్స్, ఐఓసీ సహకారంతో తమ కస్టమర్లకు బిర్యానీ (వెజ్, నాన్ వెజ్)ని అందజేస్తోంది. రూ.2,000 కన్నా ఎక్కువ ఇంధనం నింపే వారికి ఉచిత బిర్యానీ అందిస్తుండగా.. రూ.250 కంటే ఎక్కువ ఇంధన నింపే వారికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారు. గత 51 సంవత్సరాలుగా ఈ ఐఓసీ స్టేషన్‌ను నిర్వహిస్తుందని, కర్ణాటకలోనే అత్యధికంగా అమ్మకాలు జరిగినట్లు నిర్వాహకుడు ప్రకాశ్‌రావు సాథే తెలిపారు. ఇన్ని సంవత్సరాలుగా మాకు ప్రోత్సాహం ఇచ్చినందుకు వినియోగదారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్‌ను నెల పాటు.. తర్వాత వివిధ ఉత్పత్తులపై 50శాతం తగ్గింపుతో కొనసాగించాలని యోచిస్తున్నట్లు ప్రకాష్‌రావు సాథే చెప్పారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo